Nitin to launch surya movie along with Pawan Kalayans movie

Nitin to launch surya movie along with Pawan Kalayans movie

యంగ్ హీరో నితిన్ కు పవన్ అంటే చాలా ఇష్టమని.. పవన్ కు అతను వీరాభిమాని అని అందరికీ తెలిసిన సంగతే. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నితిన్ ఫైటింగ్ చేయనున్నాడు. మరి ఈ గురు శిష్యుల మధ్య ఫైటింగ్ ఏమిటో తెలుసా. పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8 న రిలీజ్ కానున్నదన్న సంగతి విధితమే. ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక నితిన్ అయితే ఫస్ట్ రోజే చూస్తాడు. కాగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా సినిమా 24 ఏప్రిల్ 14న విడుదల కానున్నది. ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను భారీ ధరకు నితిన్ దక్కించుకొన్నాడు. విక్రమ్ సూర్య ల పై నమ్మకంతో రూ.15 కోట్ల కు ఈ హక్కులను దక్కించుకొన్నాడు. దీంతో ఈ సినిమా సర్ధార్ విడుదలైన ఒక వారం గ్యాప్ లోనే విడుదల అవుతుంది. ఇక సరైనోడు సినిమా కూడా ఏప్రిల్ 8న రిలీజ్ కానున్నది. దీంతో నితిన్ సినిమాపై మెగా హీరోల సినిమాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఇప్పుడు నితిన్ పవన్ సినిమా సర్ధార్ కు పోటీగా సూర్య 24 ని రిలీజ్ చేస్తాడా..? లేక కొంత గ్యాప్ ఇస్తాడా..? ఏమో చూడాలి.