Maida chips tayari

Maida chips tayari

మైదా పిండి తో చేసే ఏ వంటకాలు అయిన బావుంటై. అందులోను సాయంత్రం ఆడుకుని అలిసిపోయి ఇంటికి వచ్చి అమ్మ ఏదైనా పెట్టు అంటూ మారం చేసే పిల్లలకి ఎంతో రుచి కరం గా ఉన్తై. కరకరలాడే ఆకలికి కాసేపు అడ్డుకట్ట వేస్తాయి. సరే చేసే విధానం తెలుసుకున్దమ్.
1. మైదా 500 గ్రామ్స్
2. ఆయిల్ 500 గ్రామ్స్
3. ఉప్పు
4. కాస్తంత వాము

ఇప్పుడు తయారీ విధానం:
మైదా పిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు కాస్త గోరు వేచా చేసిన నునె (ఒక 50 గ్రామ్స్) తీస్కుని దానిని తగినంత నీళ్ళు పోసి చపాతీ పిండి  కంటే గట్టిగ కాలుపుకోవాలి. పిండి కలిపే సమయం లోనే అందులో ఒక టీ స్పూను వాము కూడా వేసుకొవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని బాగా మద్దించి చపాతీ పీట పై దళసరిగా వత్తుకోవాలి. ఈలోగా ఈ వాతిన చిప్సు వేయించడానికి సరిపడా నునె బాణలి లో వేసి వేడి చెయ్యాలి.

అలా కగినే నునె లో ఇందాక వత్తుకున్న పిండి ని చాకు తో ఒకే పరిమాణం లో ఉన్న ముక్కలుగా కోసి నునె లో వెయించలి. ఇలా వేయించిన ముక్కలు బంగారం రంగు లోకి వచ్చాక వాటిని ఒక పళ్ళెం లో వేసి చల్లారబెట్టి ఇలా చల్లారిన చిప్స్ ను ఒక గట్టి మూత డబ్బా లో వేసి మూత పెట్టాలి.