Now have the same mobile number all over the India

Now have the same mobile number all over the India

దేశ వ్యాప్తంగా ఇకపై మొబైల్ వాడకం దారులు ఒకే నెంబర్ ని వాడె సౌకర్యం మొదలైంది. దీనిని అనుసరించి ఇదివరలో వినియోగదార్లు ఒకే రాష్ట్ర పరిధి లో వారి నెంబర్ మార్చకుండా మొబైల్ ఆపరేటర్ ని మార్చే అవకాసం ఉండేది, ఇకపై అది విస్తరించి దేశవ్యాప్తం గా మొబైల్ వినియోగదారులకి మరింత సౌలభ్యం చెకుర్చనున్ది. తాజా వార్తల ప్రకారం ఇకపై అనగా ఈ రోజు నుండి దేశవ్యాప్తం గా మీరు ఏ మొబైల్ కంపెనీ సిం కార్డు ను వినియోగిస్తున్నప్పటికి ఇకపై వేరే ఏ ఇతర రాష్ట్రమైన వెళ్ళవలిసి వచినప్పుడు అక్కడ వేరే సిం కార్డు కొనవలిసిన అవసరం నెంబర్ మర్చవలిసిన అవసరం ఉండదు. ఇకపై మీరు నిశ్చింతగా అదే నంబరు తో కొనసగవచు. ఈ సౌకర్యాన్ని  బి ఎస్ ఎన్ ఎల్, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సెల్యూలర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎం టి ఎన్ ఎల్ వారు ఇప్పటికే ప్రకటించడమైనది.

ఈ సౌకర్యాన్ని ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పైడ్ వినియోగదారులు అందరు వినియోగించుకోవచ్చు.  ఐక్య భారతాన్ని మరోకరూపం లో కూడా చూడొచ్చు అన్నమాట ఇకపై. ఈ సౌకర్యం తో మనకు కావలిసిన వారితో దేశం లో ఏ మూల ఉన్నా అందుబాటులో ఉంది మాట్లాడే అవకాసం మరింత మెరుగైనట్టే కదూ !!