Samantha said NO for 1 Crore offer for that...

Samantha said NO for 1 Crore offer for that...

టాలీవుడ్, కోలీవుడ్‌లలో టాప్ హీరోయిన్ రేంజ్ ఉన్న సమంత, తాజాగా ఓ హాట్ ఆఫర్‌కు నో చెప్పింది. ఇదే ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్. ప్రస్తుతం సమంత సూర్య సరసన అంజాన మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కాస్తంత ఎక్స్ పోజింగ్ డోసు పెంచింది సమంత. అంజాన ఫస్ట్‌లుక్ చూసిన జనాలకు అప్పుడే మతిపోయింది. అప్పటి నుంచి అది హాట్ టాపిక్ గా కొనసాగుతూనే వుంది.
ఈ సంగతి పక్కన పెడితే  బెంగుళూరుకి చెందిన ఓ రాయల్ ఫ్యామిలి సమంతకు కోటి రూపాయల ఆఫర్ ఇచ్చింది. అది సినిమా కోసం కాదు. ఆ ఇంట్లో జరుగుతున్న పెళ్ళిలో ఏర్పాటు చేసిన సంగీత్ పార్టిలో డ్యాన్స్ చేయమని సమంతకు ఆఫర్ ఇచ్చారు. ఇందుకు గాను కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు
 
 
రెండు పాటలకు డ్యాన్స్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామన్నా, సమంత నిర్మొహమాటంగా ఆఫర్‌కు నో చెప్పేసింది. అంతేనా, ఇలాంటి ఆలోచనలు ఇంకోసారి రానీయకండి అని చెప్పి పంపిందట. అయితే కోటి రూపాయల ఆఫర్‌కు సమంత అంత సులువుగా నో చెప్పటం చూసి కోలీవుడ్ హీరోయిన్లు నోళ్లు వెళ్లబెట్టారట. 
సమంత నటించిన మనం మూవీ ఈ నెల 23న రిలీజ్ కావటానికి సిద్ధంగా ఉంది.  ఏం మాయ చేశావే చిత్రంలో ముద్దు సీన్లతో అదరగొట్టిన సమంత, నాగచైతన్య మనంలో మరోసారి జతకట్టారు. వీరిద్దరి కెమిస్ట్రీ ఈ చిత్రంలో ఇంకెంత ఆకట్టుకుంటుందో చూడాలి.