15 questions for chandra babu

15 questions for chandra babu

చంద్రబాబుకు సూటిగా 15 ప్రశ్నలు బహుదూరపు బాటసారి (కొంచెం ఆలోచించు బాబూ).

బాబు తప్పు మీద తప్పులు చేస్తూ పోతూ సెల్ఫ్ గోల్ చేసుకొంటున్నాడు.

1.పాట సామానులు కొంటాం.
నిన్న మొన్నటిదాకా బాబు ను తిట్టిన కాంగ్రెస్ వారు, గతి లేక జగన్ దగ్గరికి వెళితే ఖాళీ లేదు అంటే దిక్కుతోచక నలుగు రోడ్ల కూడలిలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కబురు పంపి మరీ పిలిచి పెద్దపీటవేసి పార్టీలో చేర్చుకొంతున్నాడు బాబు.వీరిపట్ల ప్రజల్లో వ్యతిర ేకత ఉంది, వీరిని పార్టీ లో చేర్చుకోవడం వలన స్థానిక TDP నాయకత్వం ఆగ్రహంగా ఉంది.

దీనివలన TDP కాస్తా తెలుగు కాంగ్రెస్ గా మారింది తప్పితే బాబు బాపుకోనేదేముంది?

2.BJP తో పొత్తు.
విభజన పాపం లో కాంగ్రెస్ కు ఎంత వాటా ఉందొ BJP కీ అంటే వాటా ఉంది.
కాంగ్రెస్ బహిరంగంగా మేము చీలుస్తాం అని చెప్పి చీలిస్తే నమంకంగా మాయమాటలు చెప్పి కూడా BJP అదే పనిచేసింది.కాంగ్రెస్ కత్తి అయితే BJP తేనెపూసిన కత్తి.
మరి అటువంటి BJP తో పోట్టుపెట్టుకొని సీమంద్రులకు బాబు ఏమి సమాధానం చెబుతాడు?

3.అసలు రాష్ట్ర విభజన అనేది బాబు 2008 లో ఇచ్చిన లేఖ తో మొదలయింది.
ఒకసారి కాదు, రెండు సార్లు విభజన లేఖ ఇచ్చి ఇంక విభజించండి అని కేంద్రానికి సవాల్ విసిరాడు బాబు.

4.విభజించమని లేఖ ఇచ్చి సీమంధ్ర కు వెళ్లి విభజన అన్యాయం అంటాడు ఈ అపరిచితుడు.
తెలంగాణా కు వెళ్లి నేను తెలంగాణా కు వ్యతిరేకం కాదు అంటాడు ఈ గజనీ బాబు.

5.సమ న్యాయం అంటాడు పోనీ అదేంటో చెప్పు అంటే నే చెప్పా అంటాడు.

6.ప్రజసమస్యలమీద, కాంగ్రెస్ మీద పోరాడడం మానేసి నిత్యం జగన్ ను దూషిస్తూ జగన్ కు కావలసిన ఫ్రీ పబ్లిసిటి ఇచ్చాడు.

7.సరే కాంగ్రెస్ విభజించదులె అనుకోని లేఖ ఇచ్చాదనుకొన్నా కూడా తరువాత విభజనను అడ్డుకోగాలిగిన శక్తి ఉంది కూడా అడ్డుకోలేకపోయాడు అని సీమంధ్ర ప్రజలు నిలదీస్తే ఏమి చెబుతాడు?బాబు చివరికి ఎవరికీ కాకుండా పోయాడు.

చంద్రబాబుకు సూటిగా 15 ప్రశ్నలు

1. చంద్రబాబు నాయుడూ... మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలేదు?

2. సీబీఐ, ఈడీ, ఆర్ఓసీ, ఎస్ఎఫ్ఐఓ, ఏసీబీ విచారణల్ని ఎలా తప్పించుకున్నావ్? ఇందు కోసం ఏయే పార్టీల్ని, వ్యక్తుల్నీ ఎలా ఉపయోగించుకున్నావ్?

3. 1998 జనవరిలో బీజేపీ వాళ్ళు నిన్ను శిశుపాలునితో పోలుస్తూ.. నువ్వు చేసిన 100 ఘోరాలు - నేరాలను 'ప్రజాకోర్టులో బీజేపీ చార్జిషీట్' పేరుతో ప్రచురించారు. మీరు వెంటనే కంగారుపడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని బీజేపీతో డీల్‌ కుదుర్చుకోలేదా?

4. నీ సింగపూర్‌, మలేసియా, ఇతర దేశాల్లో ఆస్తులు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి?

5. సీమాంధ్రను దోచుకున్నది, తెలంగాణను సర్వనాశనం చేసిందీ - ఆ దోచుకున్నది సింగపూర్‌లో నువ్వు దాచింది నిజం కాదా?

6. నీ 1999 మేనిఫెస్టోలో నువ్వే చెప్పావు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఫ్లైట్‌ లేదు గానీ, రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌కు విమానం నడిపేలా ఏర్పాటు చేశానని రాసుకున్నావ్. (టీడీపీ 1999 మేనిఫెస్టో - 13వ పేజీ 17వ లైను). రోజూ సింగపూర్‌ ఫ్టైట్‌లో నువ్వు అధికారంలో ఉన్న 9 ఏళ్ళలో తరలించిన క్యాష్‌ ఎంత? గోల్డు ఎంత? డైమండ్సు ఎన్ని? నీ ఫ్యామిలీస్‌లో వాళ్ళు దిగేసుకుంటున్న వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, కెంపులు ఎవడబ్బ సొమ్ము?

7. కోలా కృష్ణమోహన్, దొంగ నోట్ల రామకృష్ణ గౌడ్, భారతదేశంలోనే అతి పెద్ద స్టాంపుల కుంభకోణంలో నిందితుడు తెల్గీ, హసన్‌ ఆలీలతో నీకున్న సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాల మీద విచారణకు నీవు సిద్ధమేనా? మకావో ఐలాండ్సుకు మీరు ఏకంగా 5 పర్యాయాలు డీల్సు కోసం వెళ్ళింది నిజం కాదా?

8. ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేశ్, ఒక నామా నాగేశ్వరరావు, ఒక మురళీమోహన్... ఇలా ఓ 10 మందిని వేల కోట్లకు పడగలెత్తించటం పరిపాలన అవుతుందా? వారి మీదా, నీ మీదా జాయింట్‌గా సీబీఐ లేదా మరో సంస్థతో విచారణ చేయిస్తామంటే నువ్వు రెడీనా?

9. నువ్వు, నీ కుటుంబ సభ్యులు 1994 నుంచి 2014 వరకూ చేసిన విదేశీ పర్యటనలు అన్నింటి మీద విచారణకు నీవు సిద్ధమేనా? అది జరిగితే నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ బయటపడి కనీసం 10 దేశాల్లో జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదా? ఈ 20 ఏళ్లలో నీ పాస్‌పోర్టులు, నీ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు, వాటన్నింటి మీద స్టాంపింగ్‌లు, అందులో కాగితాలు చించివేయకుండా రిలీజ్‌ చేయటానికి నీవు రెడీనా?

10. బాలాయిపల్లి భూముల కొనుగోలు మీద విచారణకు నీవు సిద్ధమేనా? నీ తండ్రి నీకు ఇచ్చిన పొలాన్ని ఆయనకే అమ్మేసినట్టు చూపావు. ఇలాంటి కొడుకు ఉండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? మీ నాన్న పేరు మీద నువ్వు చేసిన మనీ ల్యాండరింగ్‌ల వ్యవహారంపై దర్యాప్తుకు నీవు రెడీనా?

11. చివరికి నీ తల్లిని కూడా నీ మనీ ల్యాండరింగ్‌ కోసం వాడుకోలేదా? ఏ తల్లి అయినా తన బిడ్డలందరికీ తన ఆస్తిని సమంగా పంచుతుంది. అలాంటిది చిత్తూరు జిల్లాలోని మీ రెండున్నర ఎకరాల నుంచి కోట్ల రూపాయలు పంట పండినట్టు లెక్కల్లో చూపించావు. నీ పొలంలో ఏమన్నా 500 రూపాయల కట్టలు, వెయ్యి రూపాయల కట్టలు పండే చెట్లు ఆ రోజుల్లోనే వేయించావా? తల్లి పేరు మీద మనీ ల్యాండరింగ్‌ చేసి, ఆమెకు ద్రోహం చేసిన నువ్వు అదే బుద్ధితో తెలుగుతల్లికి కూడా ద్రోహం చేసి ఈ రాష్ట్ర విభజనకు లేఖ ఇవ్వటం, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయి విభజనకు అంగీకరించటం నిజం కాదా?

12. జాయింట్‌ అకౌంట్‌లో డబ్బు వేయించుకుని చివరికి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల రైతుల సొమ్ముని మింగేసిన చరిత్ర నీది కాదా? ఏలేరు స్కాం విచారణను ఎందుకు అడ్డుకున్నావ్? నీ పేరు మీద లేదా నీ బినామీ పేరు మీద ఇప్పటికీ ఆ జాయింట్‌ అకౌంట్‌ అలాగే ఉన్న మాట వాస్తవం కాదా? రైతుల నోరు కొట్టి సొమ్ములు తిన్న నువ్వ - గత 15 ఏళ్ళుగా ఏ ఒక్క ఎన్నికల్లో కూడా గెలవకుండా పోయిన మాట వాస్తవం కాదా?

13. అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయకూడదని విప్‌ జారీ చేసినందుకు మీకు ముట్టింది ఎంత? చిన్న వర్తకుల జీవితాలతో చెలగాటమాడే విదేశీ పెట్టుబడుల బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటానికి వీలుగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నీ ఎంపీలు ముగ్గుర్ని గైర్హాజరు చేయించినందుకు ముట్టిందెంత? రామచంద్రాపురం, నర్సాపురం ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు ట్రాన్సుఫర్‌ చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ మీకు ట్రాన్సుఫర్‌ చేసిన డబ్బు ఎంత? ప్రతిసారీ ఢిల్లీ వెళ్ళినప్పుడు సెక్యూరిటీ కళ్ళు గప్పి వైట్‌ కారులో మాయం అవుతున్నారు? ఎవరెవర్ని కలిశారు?

14. రాష్ట్ర విభజన విషయంలో సోనియా గాంధీ ముందు నడుస్తున్న గొర్రె అయితే - మీరు ఆ వెనక నడుస్తున్న గొర్రెలా కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని యథాతథంగా అనుసరించారంటే ఇందులో డీల్‌ ఏమిటి? శాసనసభలో, శాసన మండలిలో, లోక్‌సభలో, రాజ్యసభలో సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్‌ మందలో ఓ వీర విధేయమైన గొర్రెలా మీరు నడిచింది ప్రజలు చూడలేదా?